ఉత్తమ మహిళా క్రికెటర్‌గా పెర్రీ

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్సీ పెర్రీ.. ఈ ఏడాది ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఎంపికైంది. హర్మన్‌ప్రీత్, సాటర్‌వైట్ (న్యూజిలాండ్) నుంచి గట్టిపోటీ ఎదురైనా.. ఓటర్లు పెర్రీ వైపే మొగ్గారు. ఓటింగ్ పీరియడ్ 14 నెలల కాలంలో పెర్రీ 905 పరుగులు చేయడంతో పాటు 22 వికెట్లు తీసింది. ఏకైక యాషెస్ టెస్టులో డబుల్ సెంచరీ (213), 3 వికెట్లు తీయడం ఆమెకు కలిసొచ్చింది. ఉత్తమ వన్డే ప్లేయర్‌గా ఆమీ సాటర్‌వైట్, ఉత్తమ టీ20 మహిళా క్రికెటర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా బెత్ మూనీ (ఆస్ట్రేలియా)కి అవార్డు దక్కింది.