రోజూ గుప్పెడు వాల్‌నట్స్ తింటే మధుమేహం దూరం..!

రోజూ గుప్పెడు వాల్‌నట్స్ తింటే మధుమేహం వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన డేవిడ్ గెఫెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు తాజాగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. వారు 18 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సున్న స్త్రీ, పురుషులు 34వేల మందిపై పరిశోధనలు చేశారు. వారిలో నిత్యం వాల్‌నట్స్‌ను తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 47 శాతం వరకు తగ్గిందని తేల్చారు. అందువల్ల ఎవరైనా నిత్యం వాల్‌నట్స్‌ను గుప్పెడు మోతాదులో (మూడు టేబుల్ స్పూన్లు) తింటుంటే టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక డయాబెటిస్ ఉన్నవారు వాల్‌నట్స్‌ను తింటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని వారు అంటున్నారు. డయాబెటిస్ వల్ల శరరీంలో ఎక్కువగా పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరిడ్లు గుండె జబ్బులను, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలను తెచ్చి పెడతాయి. కనుక వాటిని నిరోధించాలంటే వాల్ నట్స్ తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. వాల్‌నట్స్‌ను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని, దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని వారు చెబుతున్నారు.

Related Stories: