లవర్ ఇంటి ముందు డ్యాన్స్ చేసిన అమ్మాయి - వీడియో

న్యూఢిల్లీ: ఓ అమ్మాయి ఫుల్ తాకింది. తన మాజీ ప్రియుడి ఇంటి ముందు మస్తీ మస్తీగా డ్యాన్స్ చేసింది. అది కూడా డీజే బాణీలకు స్టెప్పులేసింది. ఈ గమ్మత్తు ఘటన గూర్గావ్‌లో జరిగింది. తాను ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడని, దానికి ప్రతీకారంగా అతని ఇంటి ముందు ఆమె ఇలా డ్యాన్స్ చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తేరే ఇష్క్ మే నాచింగ్ అంటూ ఆ అమ్మాయి తెగ బ్రేకప్ స్టెప్పులేసింది. ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఆ వీడియోలు వైరల్‌గా మారింది. తన స్వంత డీజేను తీసుకువచ్చి.. మాజీ ప్రియుడి ఇంటి ముందు ఇలా డ్యాన్స్ చేయడం కొంత ఆశ్చర్యంగానే తోస్తోంది. కానీ ఇదో వెరైటీ నిరసన అని కొందరంటున్నారు. ఓ భారీ ట్రక్కుకు ఉన్న సౌండ్ బాక్సులతో ఈ షో చేసిందా అమ్మాయి. పోలీసులు, స్థానికులు ఆమె డ్యాన్స్‌ను చూస్తూ ఉండిపోయారు. కానీ ఎవరూ ఆపలేకపోయారు.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం