9 నెలల్లోనే.. అమ్మకాలు పూర్తి

ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ప్రదీప్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్లో రియల్ రంగం ప్రగతిపథంలో దూసుకెళుతున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారతదేశమంతటా నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతింటే.. హైదరాబాద్‌లో మాత్రం కొంతకాలం నుంచి రియల్ రంగం అనూహ్యంగా పుంజుకున్నది. గత తొమ్మిది నెలల్లో అధిక సంఖ్యలో తాము విల్లాల్ని విక్రయించడమే ఇందుకు నిదర్శనమి ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ప్రదీప్‌రెడ్డి వివరించారు. నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోను సందర్శించి నమస్తే సంపదతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
లగ్జరీ విల్లాలైనా.. బడ్జెట్ విల్లాలైనా.. మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ పెరిగింది. ఇన్‌కార్ గ్రూప్‌తో కలిసి తెల్లాపూర్‌లో మేం నిర్మిస్తున్న డివినో ప్రాజెక్టులో గత తొమ్మిది నెలల్లో జరిపిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. తెల్లాపూర్‌లో ఏడు ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో వచ్చే విల్లాల సంఖ్య.. దాదాపు ఎనభై. సుమారు 220 గజాల్లో 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో విల్లాను డెవలప్ చేశాం. నిర్మాణం చివరి దశలో ఉందీ ప్రాజెక్టు. 2018 డిసెంబరు నుంచి కొనుగోలుదారులకు అందజేయాలన్న ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. కాంటెపరరీ ఆర్కిటెక్చర్‌గా అధిక ప్రాధాన్యతనిస్తూ.. డివినోను డిజైన్ చేశాం.

-ఇందులో విల్లా తుది ధరను నిర్ణయించే ముందు చుట్టుపక్కల మార్కెట్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేశాం. గచ్చిబౌలిలో ఎక్కువగా హై ఎండ్ విల్లా ప్రాజెక్టులనే పలు నిర్మాణ సంస్థలు కడుతున్నాయని అర్థమైంది. నలగండ్లలో కొన్ని సంస్థలు విక్రయించే ఫ్లాట్ ధర.. దాదాపు కోటి రూపాయలు దాకా ఉంటున్నది. కాస్త సొమ్ము అధికంగా పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవారు.. విల్లాను కొనడానికి సైతం ముందుకొస్తారని మా సర్వేలో తేలింది. ఇలాంటి వారంతా విల్లాకే అధిక ప్రాధాన్యతనిస్తారని తెలిసింది. ఈ అంశాన్ని పక్కాగా అంచనా వేశాకే.. డివినోకు శ్రీకారం చుట్టాం. నలగండ్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో.. అమెరికాకు చెందిన టిష్మన్ స్పయర్స్ ప్రాజెక్టు తర్వాత.. మా విల్లా ప్రాజెక్టు మొదలెట్టాం. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇదే జోరులో మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆ వివరాల్ని అతిత్వరలో ప్రకటిస్తాం.