73 కిలోల గంజాయి స్వాధీనం

రంగారెడ్డి : హయత్‌నగర్‌లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 73 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు ముంబయి వాసులున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Stories: