45 రోజుల్లో 71 మంది చిన్నారులు మృతి

లక్నో : సరియైన వైద్యం అందక 45 రోజుల్లో 71 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. చిన్నారుల మృతిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో 200 పడకలు ఉండగా.. 450 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. పడకలు సరియైనన్ని లేకపోవడంతోనే చిన్నారులకు వైద్యం అందించడం కష్టమవుతుందన్నారు. రోగులను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. చిన్నారులు పలు రకాల వ్యాధుల కారణంగా మృతి చెందారని తెలిపారు. ఆస్పత్రులను ఆధునీకరిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని బాధితులు వాపోతున్నారు.

Related Stories: