టీఆర్‌ఎస్ సీనియర్ నేత కన్నుమూత

హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ జాగృతి నగర కో-కన్వీనర్ బి.శివకుమార్ (63) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నం.4లోని తన నివాసంలో ఉన్న శివకుమార్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమ సారథి కేసీఆర్ వెంట ఉన్న నాయకుల్లో ఒకరైన శివకుమార్ తెలంగాణ జాగృతిలో చురుగ్గా పనిచేశారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివకుమార్ ఇటీవల నగర కో కన్వీనర్‌గా నియమితులయ్యారు. శివకుమార్ మృతిపట్ల పలు పార్టీల నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శివకుమార్ మృతదేహానికి శనివారం పం జాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Stories: