శ‌బ‌రిమ‌ల‌లో 68 మంది అరెస్టు

శ‌బ‌రిమ‌ల: కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యం వ‌ద్ద ఇవాళ సుమారు 68 మంది భ‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆల‌యంలోకి మ‌హిళ‌లకు ప్ర‌వేశాన్ని క‌ల్పించాల‌ని సుప్రీం ఇచ్చిన తీర్పును వ్య‌తిరేకిస్తూ అయ్య‌ప్ప భ‌క్తులు భారీ నిర‌స‌న చేప‌డుతున్నారు. అయితే ఇవాళ ఉద‌యం శ‌బ‌రిమ‌ల‌లో ఆందోళ‌న చేప‌డుతున్న 68 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ‌బ‌రిమ‌ల ప్రాంతం యుద్ధ భూమిగా మారింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల కేంద్ర మంత్రి కేజీ ఆల్ఫోన్స్ తీవ్రంగా స్పందించారు. కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. శ‌బ‌రిమ‌ల‌ను ప్ర‌భుత్వ‌మే వార్‌జోన్‌గా మారుస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఆల‌యం వ‌ద్ద స‌రైన సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌డం లేద‌న్నారు. అరెస్టు అయిన వాళ్లు, భ‌క్తులు కాదు అని, వాళ్లు ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు అని సీఎం విజ‌య‌న్ ఆరోపించారు. అరెస్టు అయిన 68 మందిని పుజ‌పురా సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఓ బీజేపీ నేత‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించారు.

Related Stories: