64 మంది ప్రజాప్రతినిధులపై కిడ్నాప్ కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1024 మంది ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అందులో 64 మందిపై కిడ్నాప్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలూ ఉన్నారు. కిడ్నాప్ కేసుల్లో 16 మంది బీజేపీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీకి చెందిన ఆరేసి మంది ఈ లిస్టులో ఉన్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొటున్న వారిలో ఎన్సీపీ, బీజేడీ, డీఎంకే, ఎస్పీ, టీడీపీ, తృణమూల్, సీపీఎం, సీపీఐ, జనతాదళ్, ఎల్జేపీ పార్టీ ప్రతినిధులు ఉన్నారు. బీహార్, యూపీ ఎమ్మెల్యేలపైన మాత్రమే ఎక్కువ కిడ్నాప్ కేసులున్నాయి. బెంగాల్‌లోనూ కిడ్నాప్ కేసులు అధికంగా ఉన్నాయి. ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్‌పై అత్యధికంగా ఆరు అపహరణ కేసులున్నాయి. బీహార్ ఎంపీ రామ్ కిశోర్ సింగ్‌పై నాలుగు కిడ్నాప్ కేసులు ఉన్నాయి. కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న రాజ్యసభ ఎంపీల్లో దూట్ రాజ్‌కుమార్ నంద్‌లాల్, నారాయణ్ టాతు రాణే, చంద్రపాల్ సింగ్ యాదవ్‌లు ఉన్నారు.
× RELATED వంతెన పైనుంచి మహానదిలో పడ్డ బస్సు