హైదరాబాద్-కన్నూరు మధ్య గోఎయిర్ ఫ్లైట్

హైదరాబాద్: విమానయాన సంస్థ గోఎయిర్ ప్రాంతీయంగా మరో మూడు రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుంచి కేరళలలోని కన్నూర్‌కు విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. కన్నూర్‌లో నిర్మితమైన అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభించనున్న సందర్భంగా ఈ నూతన సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కన్నూర్ నుంచి బెంగళూరుకు వారానికి ఆరు రోజులు సర్వీసులను నడుపనున్న సంస్థ.. అదే హైదరాబాద్‌కు నాలుగు రోజు, చెన్నైకు మూడు రోజుల పాటు నడుపనున్నది.

Related Stories: