హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం

కాఠ్మాండు: రోగితోపాటు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నేపాల్‌లోని అడవుల్లో శనివారం కూలిపోయింది. ఒక విదేశీయుడితోపాటు ఆరుగురు మరణించారు. ఓ మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. ఒక ప్రైవేట్ హెలికాప్టర్.. రోగితోపాటు ప్రయాణికులతో గోర్ఖాలోని సమగావున్ నుంచి కాఠ్మాండుకు బయలుదేరింది. ఉదయం 8.10 గంటలకు కాఠ్మాండు టవర్‌తో దానికి సంబంధాలు తెగిపోయాయి. ధాడింగ్, నువాకోట్ జిల్లా సరిహద్దులో హెలికాప్టర్ కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Related Stories: