ఆస్ట్రేలియా విజ‌య ల‌క్ష్యం 323

ఆడిలైడ్: ఆస్ట్రేలియాతో జ‌ర‌గుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా 307 ప‌రుగుల‌కి ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా ముందు 323 పరుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు 151 ప‌రుగుల‌తో ఆట మొద‌లు పెట్టిన టీం ఇండియా లంచ్‌కి ముందు పుజారా (71; 9 ఫోర్లు), రోహిత్ శ‌ర్మ‌( 1) వికెట్ల‌ని కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో పేల‌వ‌మైన షాట్‌తో ఔటైన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశ‌ప‌ర‌చాడు. ఇక వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ దూకుడుగా ఆడి త‌న వికెట్‌ని త్వ‌ర‌గానే స‌మ‌ర్పించుకున్నాడు. ఇక ఈ రోజు ఉద‌యం హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న అజింక్యా ర‌హానే ( 70; 7 ఫోర్లు) రివ‌ర్స్ షాట్ ఆడే ప్ర‌యత్నం చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత అశ్విన్ (5), ష‌మీ (0), ఇషాంత్ (0), ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. ఆస్ట్రేలియా బౌల‌ర్స్‌లో లియాన్‌కి ఆరు వికెట్స్ ద‌క్క‌గా స్టార్క్ 3 వికెట్స్‌, హాజిల్‌వుడ్ ఒక వికెట్ తీసాడు. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 250 ప‌రుగుల‌కి ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 235 ప‌రుగుల‌కి ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇండియాకి 15 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఈ రోజు మ‌రో 52 ఓవ‌ర్ల ఆట‌ మిగిలి ఉండ‌గా, రేపు 90 ఓవ‌ర్లు ఆస్ట్రేలియా టీం ఆడాల్సి ఉంది. మొత్తంగా 142 ఓవ‌ర్ల‌లో మ‌న భార‌త బౌల‌ర్లు విజృంభించి ఆస్ట్రేలియాని త్వ‌ర‌గా ఔట్ చేస్తే ప్ర‌తిష్టాత్మ‌క విజ‌యం భార‌త్ ఖాతాలో చేరుతుంది.

Related Stories: