శ్రీలంక పేలుళ్లలో పెరిగిన మృతుల సంఖ్య

కొలంబో: శ్రీలంకలో ఈ ఉదయం జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. 52 మంది మృతిచెందగా 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. కొలంబోలోని కొచ్‌చికాడాలోని సెయింట్ ఆంథోని చర్చి, కథువాపితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోయ చర్చిల్లో అదేవిధంగా హోటల్ షాంగ్రిలా, సిన్నమాన్ గ్రాండ్, కింగ్స్ బరీ హోటల్స్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ సందర్భంగా ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా బాంబు పేలుళ్లు సంభవించాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర భేటీ అయింది. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శ్రీలకం బాంబు పేలుళ్లపై స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
More in జాతీయం :