ఆస్ట్రేలియా బ్యాటింగ్: ఫించ్ హాఫ్ సెంచరీ

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ చక్కటి భాగస్వామ్యంతో పరుగుల వరద సృష్టిస్తున్నారు. మొదట్లో ఓపెనర్లు కాస్త తటపటాయించినా.. తర్వాత పుంజుకొని పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. 20 ఓవర్లకు ఆస్ట్రేలియా 122 పరుగులు చేసింది. ఫించ్ 66, వార్నర్ 43 పరుగులు చేశారు.