నొప్పులను తగ్గించే సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్..!

శరీరంలో ఏ భాగంలోనైనా ఏ కారణం వల్లనైనా కొద్దిగా నొప్పి కలిగిందంటే చాలు.. చాలా మంది వెంటనే ఇంగ్లిష్ మెడిసిన్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్స్‌ను ఉపయోగిస్తారు. వాటి వల్ల నొప్పి తగ్గినప్పటికీ వాటిని వాడడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరూ ఆలోచించరు. అయితే కింద సూచించిన పలు సహజ సిద్ధమైన పదార్థాలతోనే మనకు కలిగే నొప్పులను ఎఫెక్టివ్‌గా తగ్గించుకోవచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి ఉంటే కొద్దిగా పసుపును ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. 2. అల్లంతో తయారు చేసిన టీని తాగినా లేదంటే నేరుగా కొంచెం అల్లం రసం సేవించినా నొప్పుల నుంచి బయట పడవచ్చు. 3. రెండు లవంగాలను తీసుకుని పొడి చేసి దాన్ని కొద్దిగా ఆలివ్ ఆయిల్‌లో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. 4. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, అంతే మోతాదులో యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 5. రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని బాగా నలిపి ఆ మిశ్రమానికి కొద్దిగా ఉప్పు చేర్చి నొప్పి ఉన్న భాగంలో రాస్తే ఫలితం ఉంటుంది.

Related Stories: