కొండగట్టు మృతులకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 24 మంది మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీశారు. మెరుగైన వైద్యం కోసం జగిత్యాలతో పాటు హైదరాబాద్‌కు క్షతగాత్రులను తరలించారు.
× RELATED చెట్టును ఢీకొట్టిన లారీ : డ్రైవర్ మృతి