విద్యుత్ విశ్రాంత ఉద్యోగులకు 42.5% వేతన సవరణ

ఉత్తర్వులు జారీచేసిన ఎస్పీడీసీఎల్ సీఎండీ -సీఎం కేసీఆర్‌కు విశ్రాంత ఉద్యోగ సంఘం కృతజ్ఞతలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విద్యుత్‌శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు 42.5 శాతం వేతన సవరణను ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎస్పీడీసీఎల్ నంబర్ 659.. ఉత్తర్వులను విడుదల చేసింది. విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ పెంపు అనిర్వచనీయ అనుభూతని సంఘం రాష్ట్ర నేతలు వీఎస్ సుందర్‌రావు, కలువల సత్యనారాయణరావు, రఘుమారెడ్డి, జనార్దన్, విద్యాపతి తదితరులు హర్షం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్రాంత ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం, ఇటు యాజమాన్యాలు అభిమానాన్ని చాటుకున్నాయని వారు పేర్కొన్నారు.