40వేల మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి హెచ్‌ఎండీఏ సిద్ధం..!

హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది కూడా మట్టి గణపతులను హెచ్‌ఎండీఏ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది మాదిరిగానే రసాయన రహిత గణేష్ విగ్రహాల తయారీపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మట్టి గణపతుల ప్రతిమల తయారీకి అనుభవం కలిగిన కళాకారులు, ఏజెన్సీల ఎంపికకు టెండర్లు ఆహ్వానించిన అధికారులు తెలంగాణ కుమ్మరి సంఘానికి మట్టి గణపతుల తయారీ బాధ్యతలు అప్పగించారు. 8 అడుగుల పొడవు గల ప్రతిమలు 40వేల విగ్రహాలను సిద్ధం చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా నగరవాసులకు ఈ విగ్రహాలను పంపిణీ చేయనున్నామని అధికారులు తెలిపారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?