4 అడుగుల మొసలే వాళ్ల పెట్!

ఎవరైనా ఇంట్లో పిల్లినో, కుక్కనో, కుందేలునో పెంచుకుంటారు. కాని.. యూఎస్‌లోని న్యూయార్క్‌లో ఓ ఇంటి యజమాని ఏకంగా 4 అడుగుల మొసలిని పెంచుకున్నాడు. అంతే కాదు దానికి ఆర్నాల్డ్ అనే పేరు కూడా పెట్టారు. ఓ ఇంట్లో పెద్ద మొసలి ఉందని యానిమల్స్ క్రూయెల్టీ ప్రివెన్షన్ సొసైటీకి ఎవరో కాల్ చేసి చెప్పారు. దీంతో ఆ ఇంటికి వెళ్లి తనిఖీ చేసిన సిబ్బంది 4 అడుగుల మొసలిని చూసి షాక్ అయ్యారు. దానికి సపరేట్‌గా షెడ్ వేసి.. అంతా సెటప్ చేసి కావాల్సిన ఆహారం, నీళ్లు అందజేస్తున్నారట. అది అచ్చం కండల వీరుడు ఆర్నాల్డ్ లాగా ఉండటం వల్లనే దానికి ఆ పేరు పెట్టామని...అది తమతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుందని ఇంటి యజమాని తెలియజేశాడట. ఇక.. వెంటనే సొసైటీ సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకొని వైల్డ్ లైఫ్ సాంక్షుయరీకి తరలించారు. లైసెన్స్ లేకుండా మొసలిని పెట్‌గా పెంచుకోవడం చట్టానికి విరుద్ధమని.. మొసలిని పెంచుకున్న ఆ ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని యానిమల్స్ క్రూయెల్టీ ప్రివెన్షన్ సొసైటీ చీఫ్ వెల్లడించారు.

Related Stories: