హర్యానాలో భూకంపం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: హర్యానాలోని ఝాజ్జర్ జిల్లా పరిధిలో ఆదివారం సాయంత్రం 4.37 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతున కేంద్రీకృతమై ఉన్నది. దీని ప్రభావంతో గుర్గావ్‌తోపాటు ఢిల్లీ, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు తెలిపాయి.

Related Stories: