యూపీలో జ్వరాలతో 36 మంది మృతి

బరేలీ/లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ, దాని సమీపాన ఉన్న బాదౌన్ జిల్లాలో జ్వరాల వల్ల గత 15 రోజుల్లో 36 మంది మృతిచెందారు. దీంతో అడిషనల్ డైరెక్టర్(ఆరోగ్యం), బరేలీ మలేరియా అధికారి, వైద్యాధికారి తదితరులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సస్పెండ్ చేశారు. బరేలీ, బాదౌన్ జిల్లాలో జ్వరాలను నియంత్రించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి డాక్టర్లతో మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

Related Stories: