తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియా టుడే సమగ్ర విశ్లేషణ

హైదరాబాద్: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియా టుడే న్యూస్ ఛానెల్ సమగ్ర విశ్లేషణ చేసింది. మహిళలు, గ్రామీణ, పట్టణ, మైనార్టీ ఓటర్లలో మెజార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటేసినట్టు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. ప్రధాన పక్షాలు కూటమిగా ఏర్పడ్డప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయినట్లు ఎగ్జిట్ పోల్ తేల్చింది. మహిళలు 48 శాతం టీఆర్‌ఎస్‌కు, 36 శాతం కూటమిని సమర్ధిస్తున్నట్టు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం టీఆర్‌ఎస్‌ను 39 శాతం కూటమిని సమర్ధిస్తున్నట్లు ఎగ్జిట్‌పోల్ స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 44 శాతం టీఆర్‌ఎస్‌కు, 28 శాతం కూటమికి ఓటేసినట్లు వెల్లడైంది. మైనార్టీల్లో 42 శాతం టీఆర్‌ఎస్‌ను, 32 శాతం కూటమిని, 16 శాతం ఎంఐఎంను ఎంచుకున్నట్లు వెల్లడైంది. ఎస్సీల్లో 44 శాతం టీఆర్‌ఎస్, 42 శాతం కూటమికి సమర్థిస్తున్నట్లు ఎగ్జిట్‌పోల్‌లో వెల్లడైంది. ఎస్టీల్లో 45 శాతం టీఆర్‌ఎస్‌ను సమర్ధిస్తున్నట్లు ఎగ్జిట్‌పోల్ ద్వారా వెల్లడైంది.

Related Stories: