సా.6 వరకు హుస్సేన్ సాగర్‌లో 3420 విగ్రహాలు నిమజ్జనం

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతున్నది. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వెంటనే క్రేన్ల వద్దకు పంపించి నిమజ్జనం చేయించి పంపిస్తున్నారు పోలీసులు, అధికారులు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని చర్యలను తీసుకున్నారు పోలీసులు. ఇక.. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో 3420 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై 3161, ఎన్టీఆర్ మార్గ్‌లో 259 విగ్రహాలను నిమజ్జనం చేశారు. వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు హుస్సేన్‌సాగర్‌లో 19,420 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54,358 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులకు సహకరించిన గణేశ్ ఉత్సవ కమిటీకి కృతజ్ఞతలు. నిమజ్జనాల కోసం నిర్మించిన ప్రత్యేక కొలనులు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి..జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్

Related Stories: