యో-యో టెస్టు ఇంత కఠినమా..దేవుడు కనిపించాడు! వీడియో

లండన్: ఆధునిక క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను తెలుసుకునేందుకు ఆయా టీమ్ మేనేజ్‌మెంట్లు యో-యో టెస్టును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెలక్షన్ సమయంలో భారత జట్టులో చోటు దక్కాలంటే క్రికెటర్లు ఈ పరీక్షల్లో పాస్ అయితేనే టీమ్‌లోకి తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. టెస్టుల్లో ఫేయిల్ అయిన వారు ఇటీవల జట్టులో చోటును కూడా కోల్పోయారు. ఐతే రెండు రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా తమ ప్లేయర్స్‌కు యో-యో పరీక్ష నిర్వహించింది. ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ అండర్సన్, సీనియర్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్(33) పరుగు పందెంలో పాల్గొన్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. వీరిద్దరూ 20మీటర్ల దూరంలో పెట్టిన టార్గెట్‌ను చేరుకొని మళ్లీ యథాస్థానానికి రావాల్సి ఉంది. ఆండర్స్‌న్‌తో కలిసి పరుగెత్తిన కుక్ గమ్యాన్ని చేరేలోపే అలసిపోయాడు. లక్ష్యాన్ని పూర్తిచేసిన వెంటనే కుక్ అక్కడే కుప్పకూలిపోయాడు. చాలాసేపు శ్వాస తీసుకునేందుకు ప్రయత్నించాడు. సహచర ఆటగాళ్లు అతనికి సపోర్ట్‌గా నిలిచారు. అండర్సన్ మాత్రం అలవోకగా ఛేదించడం విశేషం. ఆటగాళ్లందరూ అప్పటికే మరికొన్ని ఈవెంట్లలో పాల్గొనడంతో శక్తినంతా కోల్పోయి అలసిపోయారు. యో-యో టెస్టు ప్రమాణాలను అధిగమించాలంటే ఇంత కష్టమా అని వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు