తివిక్రమపాండ్యన్ కథ

amulya రవిబాబు, నాగబాబు, శ్రీ, అమూల్యరెడ్డి, షాలిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తివిక్రమన్. అమీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో వ్యాపారవేత్త కనుమూరి రఘురామకృష్ణరాజు విడుదలచేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రమిది. తివిక్రమపాండ్యన్ అనే రాజు మరణానికి గల కారణాల్ని అన్వేషించే క్రమంలో ఓ బృందానికి ఎదురైన అనూహ్య పరిణామాలే చిత్ర ఇతివృత్తం. కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి. డిస్కోశాంతి సోదరి సుచిత్ర ప్రత్యేక గీతంలో నటించారు. రుంకీ గోస్వామి బాణీలు, బోలే నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చినబాబు, విశ్వ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం పర్యవేక్షణ: కస్తూరి శ్రీనివాస్, సహనిర్మాత: తోటకూర రామకృష్ణారావు.
× RELATED వెంకీ అట్లూరి దర్శకత్వంలో..?