బోటు ఘటనలో తెలంగాణ నుంచి 21 మంది..!

తూర్పుగోదావరి: పాపికొండ టూర్‌లో 61 మందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో వరంగల్ కు చెందినవారు 14 మంది ఉండగా..మిగతావారు హైదరాబాద్ కు చెందినట్లు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా కడిపికొండ మహరాజు కాలనీకి చెందిన 14మంది చిట్టి పాటలో భాగంగా పాపికొండలు టూర్ కి వెళ్లి ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 12 మంది మృతదేహాలను వెలికితీయగా..మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. 30 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ప్రత్యేక హెలికాప్టర్‌ లో ఘటనా స్థలానికి చేరుకుని..గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బోటు ప్రమాదంతో బాధితుల ఇళ్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Stories:

More