బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసు విచారణ అక్టోబర్ 15కు వాయిదా

మహారాష్ట్ర: బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసు విచారణ అక్టోబర్ 15కు వాయిదా పడింది. ధర్మబాద్ కోర్టులో వాదనలు ముగిసాయి. దీనిపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాశ్‌గౌడ్, రత్నంలు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. వారికి రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నోటీసులు అందుకున్న వారంతా అక్టోబర్ 15న హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related Stories: