2.0 టీజర్, ట్రైలర్ విడుదల వాయిదా ?

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 2.0. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా జరిగింది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 2.0 ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మొదటగా 2.0 టీజర్‌ను ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లో, ట్రైలర్‌ను డిసెంబర్ 12వ తేదీన చెన్నైలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా తేదీల్లో ఆ ఈవెంట్లు నిర్వహించే అవకాశం లేదని సమాచారం. అందుకు గాను కొత్త తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా 2.0 సినిమా విడుదల తేదీపై కూడా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పష్టతా ఇప్పటి వరకు రాలేదు..!

Related Stories: