2.0 టీజర్ రిలీజ్ కి మంచి ముహూర్తం ఫిక్స్ ..!

బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో అటెన్షన్ క్రియేట్ చేస్తున్న చిత్రం 2.0. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జనవరి 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించిన యూనిట్ మళ్ళీ ఆ డేట్ ని ఏప్రిల్ 14కి పోస్ట్ పోన్ చేసింది. ఈ క్రమంలో అభిమానులు చాలా నిరుత్సాహంలో ఉన్నారు. అయితే సినిమా ఎందుకు లేట్ అవుతుందో తెలియజెప్పే క్రమంలో ఓ టీజర్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న 2.0 టీజర్ విడుదల చేయనున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. పలు భాషలలో చిత్ర టీజర్ విడుదల కానుందని, ఇది మూవీపై భారీ అంచనాలు పెంచుతుందని కోలీవుడ్ మీడియా చెబుతుంది. ఇక ఈ మధ్యే రెహమాన్ సారధ్యంలో రూపొందిన ఆడియోని దాదాపు 20 కోట్ల ఖర్చుతో దుబాయ్ లో విడుదల చేసి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ , సుధాన్సు పాండే, అదిల్ హుస్సేన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 450 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది.

Related Stories: