‘2.ఓ’ టీజ‌ర్‌పై వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 2. ఓ. చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైన‌ప్ప‌టికి సినిమా రిలీజ్‌కి మాత్రం చాలా స‌మ‌యం ప‌డుతుంది. కంప్యూటర్‌ గ్రాఫిక్‌ పనులు పలు దేశాల్లో జ‌రుగుతున్న క్ర‌మంలో సినిమా విడుద‌ల లేట్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఇటీవ‌ల సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన తేదీపై సోషల్‌మీడియాలో ప‌లు వార్తలు వచ్చాయి. గ‌త జన‌వరిలోనే విడుదల కావాల్సి ఉన్న టీజ‌ర్‌ని మే 27న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐపీఎల్-11 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విడుదల చేస్తారని వదంతులు వ్యాపించాయి. కాని అవ‌న్నీ అవాస్త‌వాలే అంటూ చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. నిర్మాణాంతార కార్య‌క్ర‌మాలు పూర్తైన త‌ర్వాత డైరెక్ట్‌గా ట్రైలర్‌నే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, పాట‌ల విడుదల వేడుకను దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వ‌హించిన‌ సంగతి తెలిసిందే. చిత్రంలో క‌థానాయిక‌గా అమీ జాక్సన్ న‌టించ‌గా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా క‌నిపించ‌నున్నారు . ఆగస్టులో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రూ.400కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా.. గతేడాది దీపావళి రోజున విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చిత్రాన్ని వాయిదా వేశారు.

Related Stories: