రోబో 2.0..అక్షయ్ విశ్వరూపం ఇదే..ఫస్ట్ లుక్

ముంబై : తమిళసూపర్‌స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్టు రోబో 2.0. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో 2.0 ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి విలన్ అక్షయ్‌కుమార్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసింది. ట్విట్టర్ ద్వారా ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. రజినీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ముంబైలోని యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోలో జరిగిన ఫస్ట్‌లుక్ లాంఛింగ్ కార్యక్రమానికి రజినీ, అక్షయ్‌, శంకర్ తోపాటు లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాష్ కరణ్, ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్, స్కిప్ట్ రచయిత జయమోహన్, కోలీవుడ్ నటులు ఆర్య, విజయ్ ఆంటోని తదితరులు హాజరయ్యారు.

Related Stories: