543 కోట్లతో 2.0 విజువల్ ఎఫెక్ట్స్

హైదరాబాద్: డైరక్టర్ శంకర్ అంటేనే భారీ బడ్జెట్ ఫిల్మ్. తలైవా రజనీకాంత్‌తో తీస్తున్న రోబో సీక్వెల్ 2.0 ఫిల్మ్.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త చరిత్ర సృష్టించనున్నది. ప్రపంచ మేటి టెక్నీషియన్స్‌తో 2.0 సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్‌డేట్ తెలిసింది. స్పెషల్ ఎఫెక్ట్స్‌తో వండర్ చేయడం డైరక్టర్ శంకర్‌కు అలవాటే. అయితే 2.0 కోసం కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ ఫిల్మ్‌ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నారు. 2.0 కోసం కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌ను క్రియేట్ చేశారట. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకులను కట్టిపడేసి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా ఇప్పటికే ఆ చిత్ర నిర్మాతలు చెప్పేశారు. ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇవాళ ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2.0 కోసం సుమారు రూ.543 కోట్లతో వీఎఫ్‌ఎక్స్‌ను రూపొందించినట్లు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తెలిపారు. డార్క్ సూపర్ హీరో పాత్రతో స్టన్ చేయనున్న అక్షయ్ .. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్మ్ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. సుమారు మూడు వేల మందికిపైగా టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేసినట్లు అక్షయ్ తెలిపారు. గురువారం వినాయక చవితి రోజున ఈ మెగా బడ్జెట్ ఫిల్మ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ దీన్ని నిర్మిస్తున్నది. అమీ జాక్సన్, అదిల్ హుస్సేన్, సుదాన్సు పాండేలు కూడా నటిస్తున్నారు.
× RELATED టీఆర్‌ఎస్ అందరి పార్టీ..: మంత్రి కేటీఆర్