ఫ్రిడ్జ్‌లో 12 అడుగుల పైతాన్‌

కేప్‌టౌన్: మీరెప్పుడైనా సూప‌ర్‌మార్కెట్ వెళ్లారా? అక్క‌డ ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగే అవ‌కాశం ఉంది. పాలు, పెరుగు ప్యాకెట్ల‌ను తీసుకునేందుకు ఓ మ‌హిళ స్టోర్‌లో ఉన్న ఫ్రిడ్జ్‌ దగ్గరకు వెళ్లింది. అయితే అక్క‌డ ఆమె ఓ వ‌స్తువున ప‌ట్టుకుంది. కానీ హ‌ఠాత్తుగా పాము అని అరిచింది. తాను ప‌ట్టుకున్న‌ది పెరుగు ప్యాకెట్ కాదు అని, అదో పాము అని తెలుసుకున్న‌ది. ఈ ఫోటో చూశారా. ఫ్రిడ్జ్ నుంచి పామును ఎలా లాగేస్తున్నారో. ద‌క్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 12 అడుగుల ఆఫ్రికన్ రాకీ పైతాన్ ఇలా ఓ క‌స్ట‌మ‌ర్‌ను భ‌య‌పెట్టింది. అక్క‌డ‌కు చేరుకున్న స్నేక్ స్నాచ‌ర్స్ దాన్ని పట్టేశారు. పైతాన్ నుంచి ప‌ట్టుకునేందుకు స్నాచ‌ర్స్ ఫ్రిడ్జ్‌లో ఉన్న సామాన్లు అన్నీ ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. కొండ‌చిలువ‌ను నేష‌న‌ల్ పార్క్‌లో వదిలేశారు. రూఫ్ లేదా డ్రెయినేజీ ద్వారా పైతాన్ ఫ్రిడ్జ్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు అంచ‌నావేశారు.

Related Stories: