బ్రెజిల్‌లో కాల్పులు : 11 మంది మృతి

హైదరాబాద్ : బ్రెజిల్‌లోని పారా స్టేట్‌లో ఆదివారం రక్తపుటేరులు పారాయి. బెలీం సిటీలోని ఓ బార్‌లోకి ప్రవేశించిన ఏడుగురు దుండగులు తుపాకులతోఓ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన ఏడుగురిలో ఒకరిని బ్రెజిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. అయితే కాల్పులు ఎందుకు జరిపారు? ఎవరూ జరిపారనే విషయాలపై స్పష్టత రాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.