రేపు సెంట్రల్ బ్యాంక్ వందేండ్ల వేడుక

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభమై వందేండ్లు పూర్తికావస్తున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉదయ్‌భాస్కర్, హైదరాబాద్ శాఖ ఏజీఎం జయరామయ్య, రీజనల్ మేనేజర్ రాథోడ్‌లు మాట్లాడుతూ.. 1918లో బ్యాంక్ ఏర్పాటవగా, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ప్రజలకు బ్యాంక్ విశిష్ఠ సేవలందించినట్లు తెలిపారు.

Related Stories: