మలబద్దకాన్ని తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!

నిత్యం వివిధ సందర్భాల్లో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అధిక బరువు, థైరాయిడ్, మధుమేహం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం సమస్య ఎదురవుతుంటుంది. అయితే దీనికి నిరంతరం మందులను వాడాల్సిన పనిలేదు. కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే మలబద్దక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కొన్ని కిస్‌మిస్‌లను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటి నుంచి రసం తీసి ఆ రసాన్ని తాగేయాలి. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది. ఇలా సమస్య పోయే వరకు రోజూ చేయాలి.

2. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఆముదంను కలిపి తాగితే విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దక సమస్య పోతుంది.

3. పాలకూరను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.

4. నిత్య నారింజ పండ్లను తిన్నా లేదంటే వాటి నుంచి తీసిన జ్యూస్‌ను తాగినా మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.

5. ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనెను సేవించాలి. ఇలా చేయడం వల్ల పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది.

6. రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ ఉసిరికాయ పొడిని కలిపి తాగితే మలబద్దకం తగ్గుతుంది.

7. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.

8. నువ్వులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదం పప్పు, అవిసె గింజలను సమాన మోతాదులో తీసుకుని పొడి చేయాలి. దీన్ని రోజూ తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది.

9. జామపండ్లను నిత్యం తింటున్నా మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.

10. రాత్రి నిద్రకు ముందు వేడి పాలలో కొద్దిగా నెయ్యి కలుపుకుని తాగితే మరుసటి రోజు విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దక సమస్య పోతుంది.

Related Stories: