గుమ్మడికాయ విత్తనాలను రోజూ తింటే కలిగే లాభాలివే..!

గుమ్మడికాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వాటితో కూర చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. అయితే కేవలం గుమ్మడికాయ మాత్రమే కాదు, అందులో ఉండే విత్తనాలను కూడా తినవచ్చు. వాటిని తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గుమ్మడికాయ విత్తనాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. వాపులకు గురికాకుండా చూస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే విటమిన్ ఇ, ఫీనోలిక్ సమ్మేళనాలు, జింక్ తదితర పోషకాలు మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. శరీర నిర్మాణానికి తోడ్పడుతాయి. 2. రోజూ గుమ్మడికాయ విత్తనాలను తింటుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాల్లో సమృద్ధిగా ఉండే అర్గినైన్ అనే సమ్మేళనం రక్తనాళాలు గట్టిపడకుండా చూస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా రక్షిస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. ఈ క్రమంలో గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ విత్తనాల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సాగేలా చేస్తుంది. దీంతో రక్తం గడ్డ కట్టకుండా, హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. 3. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు గుమ్మడికాయ విత్తనాల్లో ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. 4. మధుమేహంతో బాధపడుతున్న వారు నిత్యం గుమ్మడికాయ విత్తనాలను తినాలి. ఈ విత్తనాల్లో ఉండే ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు రోజూ గుమ్మడికాయ విత్తనాలను తినాలి. 5. గుమ్మడికాయ విత్తనాల్లో సమృద్ధిగా ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చర్మం, వెంట్రుకలను సంరక్షిస్తాయి. అలాగే జీర్ణాశయంలో ఉండే హానికారక బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. 6. ట్రిప్టోఫాన్, జింక్, మెగ్నిషియంలు ఈ విత్తనాల్లో ఉన్నందున ఇవి చక్కని నిద్ర వచ్చేలా చేస్తాయి. దీంతో నిద్రలేమి సమస్య పోతుంది. అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 7. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. శుక్ర కణాలు మరింత చురుగ్గా కదులుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మహిళలు నిత్యం ఈ విత్తనాలను తింటుంటే రుతు సమస్యలు తొలగిపోతాయి. తలనొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 8. మూత్రాశయ సమస్యలు ఉన్నవారు నిత్యం గుమ్మడికాయ విత్తనాలను తినడం ఎంతగానో మేలు చేస్తుంది. కనీసం 3 నెలల పాటు ఈ విత్తనాలను తింటే మూత్రాశయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 9. ప్రోస్టేట్, బ్రెస్ట్, కొలన్ క్యాన్సర్లు రాకుండా చూడడంలో గుమ్మడికాయ విత్తనాలు దోహదం చేస్తాయి. 10. అధిక బరువును తగ్గించడంలోనూ గుమ్మడికాయ విత్తనాలు మేలు చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఈ విత్తనాలను తింటే ఆకలి అదుపులో ఉంటుంది. దీని వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.

Related Stories: