ఫ్లాట్‌లో 10 అడుగుల కొండచిలువ..వీడియో

గురుగ్రామ్: హర్యానాలో కొండచిలువ జనావాసాల్లోకి చొరబడి హల్‌చల్ చేసింది. ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని ఫ్లాట్ నంబర్ డీఎల్‌ఎఫ్ 5లోకి కొండచిలువ ప్రవేశించింది. కొండచిలువ 10 అడుగుల పొడవు 11 కిలోల బరువుంది. తమ ఫ్లాట్‌లోకి కొండ చిలువ వచ్చినట్లు స్థానికులు సమాచారమందించారని, ఫ్లాట్‌లోకి వెళ్లి దానిని పట్టుకున్నామని జంతుసంరక్షణ కార్యకర్త అనిల్ గండాస్ తెలిపారు. ఇండియన్ రాక్ పైతాన్ ఆరోగ్యంగా ఉందని, దాన్ని అటవీ ప్రాంతంలో వెదిలిపెట్టామని వెల్లడించారు. కొండచిలువను పట్టుకునేందుకు 15 నిమిషాల సమయం పట్టిందన్నారు.

× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం