నమో నమామి

ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

- బమ్మెర పోతన (మహాభాగవతం, అష్టమ స్కంధం)

ఈ వామన జయంతి సందర్భంగా ఆ స్వామి గొప్పతనాన్ని అభివర్ణించిన అద్భుత పద్యమిది. బాల వామనమూర్తి అంతకంతకూ పెరుగుతూ, బ్రహ్మాండమంతా తానే అయిన వైనాన్ని తెలియజెప్పిన తీరు అసాధారణం. మూడడుగుల నేలను దానంగా పొంది, రాక్షసరాజు బలి చక్రవర్తి పీడను దేవతలకు తొలగించిన ఆ దేవదేవుని ఈ రకంగా స్తుతిద్దాం.