వంట చిట్కాలు

-పులుసులో కారం ఎక్కువైనప్పుడు చపాతీ పిండిని ఉండలుగా చేసి పులుసులో వేయండి. కాసేపాగి తీసేయండి. కారం తగ్గుతుంది. -కొత్తిమీర ఆకులను చారులో వేశారా? అయితే.. వాటి కాడలను పారేయకండి. వాటిని పులుసులో వేసి కొద్దిసేపటి తర్వాత తీసేయండి. పులుసు రుచి, వాసన మరింత పెరుగుతుంది. -సాంబార్ చేసేటప్పుడు అందులో కొంచెం మెంతుల పొడి కలుపండి. ఎక్కువసేపు పాడవకుండా ఉంటుంది.