మగువల మనసు దోచేలా..!

చక్కనమ్మ ఏది కట్టినా అందమే.. ఏది చుట్టినా ఆనందమే.. ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు టాప్‌లు.. సంప్రదాయతకు అద్దం పట్టాలంటే చీరలు.. అన్ని అకేషన్లలోనూ అనార్కలీలు.. మగువల్ని మనసు దోచేస్తాయి.. ఈవారం అన్ని కలెక్షన్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం..
1. పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్‌ని లెహంగాగా డిజైన్ చేశారు. దీని మీద నూలుతో పువ్వులను కుట్టారు. మధ్యన వచ్చిన సీక్వెన్స్ వర్క్ లెహంగా అందానికి మరింత వన్నె తెచ్చింది. పింక్ నెట్ దుపట్టా మీద కూడా హెవీగా వర్క్ చేయించారు. గోల్డెన్ టిష్యూ బ్లౌజ్‌కి నెట్ స్లీవ్స్ అటాచ్ చేశారు. దాని మీద కూడా నూలు, సీక్వెన్స్, జర్దోసీలతో హెవీగా వర్క్ చేయించడంతో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది. 2. వెస్ట్రన్ వేర్ ఇష్టపడేవాళ్ల కోసమే ఈ డ్రెస్. రెండు లేయర్లుగా వచ్చిన లాంగ్ టాప్ ఇది. పైన బ్లూ కలర్ లైన్స్‌తో వచ్చిన హోజేరీ ఫ్యాబ్రిక్ ఇది. దీని మీద మెషీన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. నెక్ లైన్ దగ్గర కాసు వర్క్‌తో మెరిపించేశారు. కింద ఎర్రని హోజేరీ మీద కూడా మెషీన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. నడుము దగ్గర ఇచ్చిన టస్సెల్స్, బెల్ ఫుల్ స్లీవ్స్ దీనికి ప్రధాన ఆకర్షణ.
3. ఏ అకేషన్లలోనైనా అందంగా మెరిసేందుకు ఈ చీర కట్టాల్సిందే! ప్యూరీ సిల్క్ మీద సెల్ఫ్ మోటివ్స్ వచ్చాయి. ఆరెంజ్ కలర్ బార్డర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్యూర్ సిల్క్ యెల్లో కలర్ బ్లౌజ్‌కి స్లీవ్స్ మీద సీక్వెన్స్ వర్క్‌తో హైలైట్ చేయడంతో మరింత అందంగా మెరిసిపోతున్నది. 4. పండుగల్లో ప్రత్యేకంగా నిలిచేందుకు ఇలాంటి చీరల్ని ఎంచుకోవాల్సిందే! ఆరెంజ్ కలర్ బెనారస్ చీరకి బూడిద రంగు జరీ బార్డర్ వచ్చింది. పల్లూ గోల్డెన్ కలర్‌లో మెరిసిపోతున్నది. ఇక బూడిద రంగు బెనారస్ బ్లౌజ్ మీద జర్దోసీ, కుందన్స్ వర్క్ అమ్మడి అందాన్ని రెట్టింపు చేసింది. 5. కాలేజీ అమ్మాయిలకు ఇది పర్‌ఫెక్ట్ చాయిస్. చందేరీ ప్రింటెడ్ డ్రెస్ ఇది. దీనికి గోల్డెన్ జరీ బార్డర్ వచ్చింది. దీని మీదకి నల్లని చందేరీ కోట్‌లాగా రావడంతో చిక్ లుక్ సొంతమైంది. 3/4 స్లీవ్స్‌తో, ముందు వచ్చిన బటన్స్‌తో డ్రెస్ చూడముచ్చటగా కనిపిస్తున్నది.