అరోరా మిచెలిన్ స్టార్

ఎక్కడ చూసినా రెస్టారెంట్ల హవా నడుస్తున్నది. రెస్టారెంట్‌ని నడుపాలంటే మగవారికే సాధ్యమని నిరుత్సాహపడే వారికి ఒక మహిళ ఆదర్శంగా నిలుస్తున్నది. ఓ రెస్టారెంట్‌ను విజయవంతంగా నడిపిస్తూ.. మిచెలిన్ స్టార్ అనే అరుదైన గౌరవాన్ని అందుకున్నది. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడుందంటే?

ఇప్పటివరకు మగవాళ్లే మిచెలిన్ స్టార్ జాబితాకి ఎంపికయ్యేవారు. కానీ, 2019వ సంవత్సారానికి ఓ మహిళా దాన్ని బ్రేక్ చేసింది. మన దేశానికి చెందిన గరిమ ఆరోరా అనే మహిళ థాయ్‌లాండ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. దాని పేరు గా. బ్యాంకాక్‌లో అన్నీ రెస్టారెంట్‌లకు మాగవాళ్లే యాజమాన్యం. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని తానే సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించించారు. అరోరా మంచి చెఫ్ కూడా. రెస్టారెంట్‌లోని పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. థాయ్‌లాండ్‌లో గా రెస్టారెంట్ అంటే చాలా ప్రత్యేకం. ముంబైలోని జై హింద్ కాలేజీలో చదువుకున్నది. కొన్ని రోజలు జర్నలిస్టుగా పనిచేసింది. అరోరాకి రకరకాల వంటలు చేయడమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను రెస్టారెంట్ ప్రారంభించేలా చేసింది. మిచెలిన్ గైడ్ బ్యాంకాక్, ఫుకెట్, ఫాంగ్-నగ సంస్థలు.. మిచెలిన్ స్టార్-2019 సంవత్సరానికి గాను 27 రెస్టారెంట్‌లను ఎంపిక చేసింది. అందులో గా రెస్టారెంట్ ఎన్నికవ్వడం గమనార్హం. దీని గురించి అరోరా మాట్లాడుతూ రెస్టారెంట్ ప్రారంభించిన ఒకటిన్నర సంవత్సరానికే గుర్తింపు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. గా రెస్టారెంట్ మిచెలిన్ స్టార్ జాబితాలో స్థానం సంపాదించి భారతదేశం గర్వపడేలా చేసిందని అరోరాను అందరూ అభినందిస్తున్నారు.