చర్మం తేజస్సుతో..!

అందంగా కనిపించడానికి మహిళలు తహతహలాడుతుంటారు. ఏం చెయ్యాలో తెలియని వారు మార్కెట్లో దొరికే అన్ని క్రీములు వాడి చర్మాన్ని మరింత పాడుచేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఈ చిట్కాలు.
- మొక్కజొన్న పిండి, పెరుగు రెండింటిని కలిపి మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చెయ్యాలి. - వేడినీటిలో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి పరగడుపున తాగితే చర్మం మెరిసిపోతుంది. - నిద్రించే ముందు రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. - ముల్తానీమట్టి, రోజ్‌వాటర్, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. - ఓట్స్‌పొడిలో కొంచెం నిమ్మరసం, కొడిగుడ్డు తొల్లసొన కలుపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా అందంగా తయారవుతారు.