ఇంట్లో గాలిని శుభ్రపరిచే మొక్కలు!

ప్రకృతిలో ఉండే కొన్ని మొక్కలు గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌తోపాటు మలినాలు, విషవాయువులను సైతం గ్రహించి స్వచ్ఛమైన గాలిలా మారుస్తాయి.
-ఇలాంటి మొక్కల్లో వెదురు ఒకటి. ఇది ఇంట్లో ఉంటే చాలు హానికరమైన రసాయనాలను తీసివేయడంలో బాగా పని చేస్తుంది. దీనికి పెద్దగా సూర్యరశ్మి అవసరం ఉండదు. -పోక చెక్క మొక్క కూడా వెదురు మొక్క వలే ఆరోగ్యమైన గాలిని అందించేందుకు తోడ్పడుతుంది. -రబ్బరు చెట్లు కూడా కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్,ట్రైక్లోరోథలిన్ తొలగించడానికి ఉపయోగపడుతాయి. -తులిప్ మొక్కలు ఇంట్లో అందంగా కనిపించడమేకాకుండా గాలిని స్వచ్ఛంగా చేస్తాయి. అంతేకాదు ఇది అమ్మోనియాను పారదోలడంలో దోహదపడుతుంది.