ఎలాగంటే?

ఆకాశంలో నక్షత్రాలు చూడటానికి చిన్న చుక్కల్లా కనిపించినా నిజానికి అవి మహాగ్ని గోళాలు. మన సూర్యునిలాంటి నక్షత్రాలు విశ్వంలో అనంతం. ప్రాచీన గణిత- జ్యోతిష శాస్ర్తాలు 27 నక్షత్రాలను గుర్తించి వాటికి పేర్లు కూడా పెట్టాయి. అశ్విని, భరణిల నుంచి ఉత్తరాభాద్ర, రేవతిల వరకు! మన ఒక్క పాలపుంతలోనే 20 వేలకోట్ల నక్షత్రాలు ఉన్నట్టు అంచనా. ఇలాంటి పాలవెల్లులు (నక్షత్ర మండలాలు) విశ్వం మొత్తం మీద అనంత సంఖ్యలో ఉంటాయి. ఐతే, ఒక్కో నక్షత్రానికి నడుమ కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం ఉండటం వల్లే అవి మనకు చిన్న చుక్కల్లా కనిపిస్తుంటాయి. పరమాణువుల చర్యలవల్ల వీటిలో నిరంతరం శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. అదే కాంతిరూపంలో విడుదలవుతుంది.