పసుపుతో చర్మకాంతి!

కొందరికి జిడ్డు చర్మం, మరికొందరికి పొడిబారిన చర్మం, మొటిమలతో విసుగుచెందుతుంటారు. పసుపు యాంటీబయాటిక్‌గా చర్మ సమస్యలను పోగొడుతుంది. ఈ కింది చిట్కాలను ప్రయత్నించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి.
-పసుపు, నిమ్మరసం, శనగపిండి మూడింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మంపై జిడ్డు పోతుంది. -నిమ్మరసం, పెరుగు, పసుపుని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుగాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. -దోసకాయ రసం, పసుపుని సమానంగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. -బియ్యంపిండి, తేనె, నిమ్మరసం, కొంచెం పసుపు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. తరుచూ ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.