కేసీఆరే తారకమంత్రం

ఈ పర్యటనలో మాకు అర్థం అయింది ఒకటే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పధ్నాలుగు నియోజకవర్గాలలో పన్నెండు కచ్చితంగా తెరాస ఖాతాలో పడతాయి. చాలామంది కేసీఆర్ అన్న మూడు అక్షరాలను తారకమంత్రంగా జపిస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, కచ్చితంగా అందుతున్న పింఛన్లు, సాగునీటి వసతి, కల్యాణలక్ష్మి తో పాటు కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్ రాబోయే ఎన్నికల్లో తెరాసకు విజయసోపానాలుగా పనిచేస్తాయి! తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగా రా మోగబోతున్న సందర్భంలో, ఎవరికి వారే తమ పార్టీకి అధికారం దక్కబోతున్నదని ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన జిల్లాలలో ఏ పార్టీకి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి, ఓటర్లు ఎవరికి పట్టాభిషేకం చెయ్యబోతున్నారు అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేను, మరో ఇద్దరు ఔత్సాహిక మిత్రులు అనుకున్నాం. ఈ మేరకు మొన్న ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లాలో కనీసం రెండు వందలకు పైగా గ్రామాలను సందర్శించడం జరిగింది. మా లక్ష్యం ప్రధానంగా ఏమిటంటే, ఈ జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఇంతవరకు ఏమై నా అభివృద్ధి అనేది కనిపిస్తున్నదా? వ్యవసాయం, నీరు, కరెంట్, పాఠశాలలు మున్నగు రంగాలలో సాధించింది ఏమైనా ఉన్నదా అని పరిశీలించడం. మా పర్యటనలో భాగంగా మొదట జడ్చర్లలో అడుగుపెట్టా ము. అక్కడ ఒక చోట కొందరు వ్యవసాయదారులు కనిపించారు. అయిదారు కొత్త ట్రాక్టర్లు కనిపించాయి. ఒక వ్యక్తి ని పలకరించాము. వ్యవసాయశాఖ ద్వారా యాభై శాతం సబ్సిడీతో కేసీఆర్ ప్రభుత్వం తమకు ట్రాక్టర్లను అందించిందని, ట్రాక్టర్లతో తమకు పొలాలు దున్నుకోవడానికి, పంటలను రవాణాచేసుకోవడానికి అవకాశం కలిగిందని, తామం తా సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. మేము వారితో మాట్లాడుతుండగా, అక్కడకు మరికొందరు వచ్చారు. ఎల్‌ఐసి ఏజెంట్‌గా పనిచేస్తున్న ఒక మధ్య వయస్కుడు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు నీటి కొరత తో చాలా ఇబ్బందులు పడేవారమని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక చెరువుల పూడికతీత, కాలువల తవ్వకం, రైతుబం ధు పథకం కింద ఆర్థికసాయం చేయడంతో పాలమూరు చెప్పుకోదగిన అభివృద్ధి సాధించిందని, మరోసారి కూడా కేసీఆర్‌కే ఓటు వేస్తామని చెప్పుకొచ్చారు. అక్కడున్న మరో పదిమంది కూడా కేసీఆర్ ప్రభుత్వం పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వ మే రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇక్కడ పలు సామాజికవర్గాలను పలకరించిన తరువాత మా వాహనం వనపర్తి వైపు మళ్లింది. గతంలో రెండుసార్లు నేను ఈ దారిలో ప్రయాణించాను. అప్పుడు తాటిచెట్లు, తుమ్మచెట్లు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ హరితహారం కనిపించింది. పచ్చలతోరణంలా ఏపుగా ఎదుగుతున్న చెట్లు కనులకు ఇంపుగా కనిపిస్తున్నాయి. గతంలో బీడుగా కనిపించిన భూములు ఇప్పుడు పచ్చకోకలు కప్పుకున్నాయి. నిండుగా పారుతున్న విశాలమైన కాలువలు వయ్యారంగా ప్రవహిస్తూ కోనసీమ ను తలపించింది ఆ మార్గం అంతా. ఆ తరువాత వనపర్తిలో మా సర్వే కొనసాగింది. అక్కడ వివిధరకాలుగా వృత్తులు చేసుకుంటున్నవారిని పలకరించాము. కూరలు అమ్ముకునేవారు, ఆటో డ్రైవర్లు, రిక్షావాలాలు, చేతివృత్తులు చేసుకునేవారిని సంప్ర దించాము. అక్కడ కనిపించిన ప్రతిఒక్కరు కేసీఆర్ పథకాల ద్వారా తాము లబ్ధి పొందామని, ప్రతి ఒక్క ఇంట్లో ఒక లబ్ధి దారుడు ఉన్నారని, మళ్ళీ మాకు కేసీఆరే కావాలని అభిలాషించారు. అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అవకాశాల గూర్చి విచారించాము. నిరంజన్ రెడ్డి నిద్రాహారాలు లేకుండా గత నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని, నియోజకవర్గంలోని ముఖ్య సమస్యలను ముఖ్యమం త్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించారని చెప్పారు. అధికారులను ఒప్పిస్తూ అవసరమైన నిధులను తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగి స్తున్నారని వెల్ల డించారు. ఆయన ప్రచారం చెయ్యకపోయినా ఆయన్ను గెలిపించుకుంటామని అనేకమంది చెప్పుకొచ్చారు. ఆ తరువాత నిరంజన్ రెడ్డి గారింటికి వెళ్ళాము.ఆయన మమ్మల్ని ఆప్యాయం గా ఆహ్వానించారు. ప్రత్యేకంగా మాతో ఒక అరగంట పాటు ముచ్చటించారు. కేసీఆర్‌తో తనకున్న అనుబంధం, ఉద్యమకాలం నుంచి ఆయన వెంట నడిచిన తీరు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక, కేసీఆర్‌ను ఒప్పించి నిధులను ఎలా తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వివరంగా చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ నుంచి ముంబై, దుబాయి వలసలు వెళ్లిన దాదాపు ఇరవై లక్షలమంది కూలీనాలీ జనం తొంభయి శాతం మంది వెనక్కు తిరిగివచ్చారని, ఇక్కడే ఉపాధి పొందుతూ ఆనందంగా జీవిస్తున్నారని వివరించా రు. శంకరసముద్రం, బీమా కాలువల గూర్చి చెప్పి వీలయి తే సందర్శించాల్సిందిగా కోరారు. తన ఆశ, శ్వాస, ధ్యాస మొత్తం కేసీఆరే అని, కేసీఆర్ నాయకత్వంలో పనిచెయ్య డం తన అదృష్టమని చెప్పారు. అలాగే మమ్మల్ని భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరి చక్కటి ఆతిథ్యాన్ని అందించారు.
ఆ తరువాత మేము బీమా కాలువలు, మిషన్ భగీరథ ప్రాజె క్ట్ భవనాలను సందర్శించాము. శంకరపల్లి సముద్రం (కానాయపల్లి రిజర్వాయర్)ను సందర్శించాము. నిండు గోదావరా అని భ్రమింపజేస్తున్న ఆ జలసిరి, దానికింద సాగు అవు తున్న వేలాది ఎకరాలు చూసి తన్మయులమైనా ము. నిరంజన్ రెడ్డి గారి మదిలో మెరిసిన ఆలోచన బీమా కాలువలు అరవై కిలోమీటర్ల పొడవున కనిపించాయి, గొలుసుకట్టు చెరువులను నింపుతాయట. ఆ నీటి ద్వారా నలభై అయిదువేల ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతున్నదని చెప్పారు. ఇక అక్కడినుంచి దేవరకద్ర మార్గంలో పయనించాము. దారి పొడవునా అనేక గ్రామాల్లో ఆగి అక్కడివారిని పలకరించాము. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అయిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, మత్స్యకార్మికుల కోసం పథకాలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. గొర్రెల లబ్ధిదారులు, ముఖ్యమంత్రి సహాయానిధినుంచి డబ్బులు అందుకున్నవారు గ్రామగ్రామాన కనిపించారు. కేసీయార్ గూర్చి చెబుతుంటే వారి ముఖాల్లో ఆనందం ఏమాత్రం దాచుకోలేకపోయారు. మాకు మళ్ళీ మళ్ళీ కేసీఆరే కావాలి. మా ఓట్లు టీఆర్‌ఎస్‌కు మాత్రమే వేస్తాము అని విస్పష్టంగా చెప్పారు. ఈ పర్యటనలో మాకు అర్థం అయింది ఒకటే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పధ్నాలుగు నియోజకవర్గాల లో పన్నెండు కచ్చితంగా తెరాస ఖాతాలో పడతాయి. చాలామంది కేసీఆర్ అన్న మూడు అక్షరాలను తారకమంత్రంగా జపిస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, కచ్చితం గా అందుతున్న పింఛన్లు, సాగునీటి వసతి, కల్యాణలక్ష్మితో పాటు కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్ రాబోయే ఎన్నికల్లో తెరాసకు విజయసోపానాలుగా పనిచేస్తాయి! (వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)