పద్యనీతి

ఉన్న ఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్ద తనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ.

-యోగి వేమన

మనిషి ఎంతటి ఘనతను కలిగి వుంటే అంతటి గౌరవాన్ని పొందుతాడు. గొప్పతనానికి వయసుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీ కృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికంటే గొప్పగా గౌరవించబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కదా కారణం. అన్న నీతిని చక్కగా వెల్లడించిన పద్యమిది.