బాత్‌టబ్ ఎంపిక ఇలా..

ఇట్లో ప్రతి గదిని అందంగా మార్చుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే బాత్ టబ్‌లు విషయంలో ఈ నియమాలు పాటించాలి.
-కార్నర్ టబ్‌ను ఎంచుకోవడం వల్ల గదిలోని స్థలం కూడా ఆదా చేసుకోవచ్చు. అప్పుడు బాత్ రూమ్‌లో కాస్త ఖాళీ ఏర్పడడమే కాకుండా అందంగా కూడా కనిపిస్తుంది. -పూర్తిగా నీటిలో మునిగి జలకాలాడాలనుకునే వారికి జపనీస్ ైస్టెల్ సోకింగ్ టబ్ సరైనది. తక్కువ విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. -ఎక్కువ సేపు స్నానం చేయాలంటే యాంగిల్డ్ ఫ్రీ స్టాండింగ్ టబ్ సరైన ఎంపిక. గోరు వెచ్చని నీళ్ళలో ఉంటూ పుస్తకాలు చదివే వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. -డ్రాప్ ఇన్ టబ్.. దీనికి కాస్త ఖర్చు ఎక్కువే అయినా, మంచి లగ్జరీ లుక్ ఇస్తుంది. -శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే వారికి క్లౌఫూట్ టబ్ చాలా ఉత్తమం. దీన్ని తక్కువ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.