పిల్లలకు పెద్ద ఫ్యాషన్లు!

బుట్టబొమ్మల్లాంటి పాపాయిలకి.. ముద్దులొలికే అబ్బాయిలకి.. మునుపటిలా డ్రెస్‌లు వేస్తానంటే కుదరదు! వాళ్లు అచ్చు అమ్మానాన్నల్లా తయారవ్వాలని కోరుకుంటున్నారు. వారి మనసెరిగి ఫ్యాషనిస్టులు కూడా.. పిల్లలకు అలాంటి ట్రెండ్‌నే సెట్ చేస్తున్నారు.. వేడుకల్లో, పండుగ సమయాల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు.. పిల్లల కోసం వచ్చిన నయా ట్రెండీ కలెక్షన్స్.
పీచ్ కలర్ లాంగ్ గౌన్ ఇది. ఎక్కువ గేర్‌తో.. లేయర్లుగా డిజైన్ చేశారు. పైన హెవీ వర్క్ గౌన్ అందాన్ని రెట్టింపు చేసింది.
అనార్కలీ డ్రెస్ ఇది. లాంగ్ లెంగ్త్‌లో క్రీమ్, రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్‌గా ఉంది. కోల్డ్ షోల్డర్స్, ఎర్రని దుపట్టా వచ్చాయి. నెక్ లైన్ దగ్గర, స్లీవ్స్ దగ్గర వచ్చిన వర్క్ అందరినీ కట్టిపడేస్తుంది.
ఫ్లోరల్ పింట్ వచ్చిన ఆకుపచ్చని కుర్తా ఇది. దీని మీద గోల్డ్ పువ్వులు, కాలర్ నెక్, ఫుల్ స్లీవ్స్ అదిరిపోయే లుక్‌ని తెచ్చి పెట్టింది. దీనికి గోల్డెన్ ధోతీ పైజామా పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది.
మగపిల్లలకు కూడా ఇప్పుడు చాలా కలెక్షన్స్ వచ్చాయి. ఎర్రని కుర్తా మీద పచ్చని చెక్స్ వచ్చాయి. సైడ్ బటన్స్ ఆకర్షణగా నిలిచాయి. దీనికి క్రీమ్ కలర్ ధోతీ పైజామా బాగా సూటయింది.
పిల్లలు మరింత ైస్టెలిష్‌గా కనిపించాలా? అయితే ఈ డ్రెస్ వేయండి. మూడు డిఫరెంట్ రంగులను ఎంచుకొని వాటిని లేయర్లుగా డిజైన్ చేశారు. పైన కోట్‌లాగా ఇచ్చి దాన్ని గోల్డెన్ వర్క్‌తో హైలైట్ చేశారు. పెప్లమ్ స్లీవ్స్ డ్రెస్ అందాన్ని రెట్టింపు చేశాయి.